జగన్ కు షర్మిల ఫై ప్రేమ తగ్గలేదు – సజ్జల

వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగానూ విభేదాలున్నాయంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని వైసీపీ ముఖ్య నేత , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ‘రాజకీయ లక్ష్యాలే తప్ప వైఎస్ కుటుంబంలో ఏ గొడవలూ లేవు. షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. షర్మిలే రాజకీయంగా తప్పటడుగు వేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రభావం ఏమాత్రం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే నారా లోకేష్ రెడ్ బుక్ ఫై కూడా స్పందించారు. ‘ఆయన రెడ్ బుక్ దేనికో అర్థం కావడం లేదు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా ఈ బుక్ ఏంటి..? ముందు ఆయన మంగళగిరిలో గెలవాలి కదా..?’ అని ఎద్దేవా చేశారు. కాగా తమ పార్టీ కేడర్ను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, పోలీసులు, చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లను ఈ బుక్లో రాస్తున్నట్లు లోకేశ్ గతంలో వెల్లడించారు. దీనిపై సజ్జల ఫై విధంగా స్పందించారు.