రూ.200 కోట్ల క్లబ్‌లోకి వాల్తేర్ వీరయ్య

చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ పది రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. మెగాస్టార్ నుండి అసలు సిసలైన మాస్ ఫిలిం వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి వాల్తేర్ వీరయ్య తో రుజువైంది. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి – శృతి హాసన్ జంటగా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ..సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన నాటి నుండి ఈరోజు వరకు కూడా హౌస్ ఫుల్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మధ్య కాలంలో హౌస్ ఫుల్ బోర్డ్స్ ఎక్కువగా కనిపించిన సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాలే అనిచెప్పవచ్చు.

విడుదలైన తొలి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన వాల్తేరు వీరయ్య సినిమా తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీసు వద్ద 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమాలోని మెగాస్టార్‌ కొత్త పోస్టర్‌కు కూడా రిలీజ్‌ చేసింది. కాగా వాల్తేరు వీరయ్య రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిరంజీవి మూడో సినిమా. అంతకు ముందు ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి.