గుడ్ న్యూస్ : స్పృహ‌లోకి వ‌చ్చిన తేజు..మొదటగా అన్నమాట అదే..

గుడ్ న్యూస్ : స్పృహ‌లోకి వ‌చ్చిన తేజు..మొదటగా అన్నమాట అదే..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్..స్పృహ‌లోకి వచ్చారు. శుక్రవారం తేజు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న ఈయన కొద్దీ సేపటి క్రితం స్పృహ‌లోకి వచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు. స్పృహ‌లోకి వ‌చ్చిన సాయి ఒకే ఒక మాట మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. నొప్పిగా ఉంద‌ని సాయి చెప్పిన‌ట్లు స‌మాచారం.

సాయి ప్రమాదం సీసీ ఫుటేజ్ లో చూసిన వారంతా తేజుకు ఇది పున‌ర్జ‌న్మే అంటున్నారు. హైద‌రాబాద్ నగరం లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో వెళుతుండ‌గా తేజు బైక్ ఒక్కసారిగా స్కిడ్ అయ్యింది. బైక్‌తో పాటు తేజ్ కూడా రోడ్డుపై దొర్లుతూ ముందుకు వేగంగా వెళ్లాడు. ఆ స‌మ‌యంలో సాయి హెల్మెట్ ధ‌రించి ఉన్నాడు. దీంతో తలకు పెద్దగా గాయాలు కాలేదు అయినప్ప‌టికీ శ‌రీరం లోని ఇత‌ర భాగాల‌కు గాయాల‌య్యాయి. కానీ సీసీ కెమేరాలో ప్ర‌మాద దృశ్యం చూస్తే… అత‌ని ప్రాణం గ‌ట్టిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ స‌మ‌యంలో ఇత‌ర వాహ‌నాలేవైనా ఆయ‌న‌పై వెళ్లి వుంటే…ప‌రిస్థితిని ఊహించుకుంటే భ‌యమేస్తుంద‌ని అంటున్నారు.