హైదరాబాద్ లో దారుణం : తల్లిని పొట్టనపెట్టుకున్న కూతురు

హైదరాబాద్ లో దారుణం : తల్లిని పొట్టనపెట్టుకున్న కూతురు

నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చి , పాలిచ్చి పెంచి, మురిపాలతో మురిపించి, మంచి క్రమశిక్షణ, నడవడికతో పెంచి, మన ఎదుగుదల కోసం తమ ఆరోగ్యాలను లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమిస్తూ, మన సంతోషమే ఆమె సంతోషంగా బ్రతికే నిస్వార్ధ మనిషి అమ్మ. అలాంటి అమ్మను పొట్టనపెట్టుకుంది ఓ కూతురు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తల్లిని హత్య చేసి పోలీసులకు అడ్డంగా దొరికింది.

వివరాల్లోకి వెళ్తే..

రాజేంద్రనగర్ లో ఉంటున్న మేరీ క్రిస్టియన్, చిన్నప్పట్నుంచి కూతురు రుమాను ప్రేమగా పెంచింది. అయితే రూమాకు ఈమె అసలు తల్లి కాదు, పెంపుడు తల్లి మాత్రమే. స్థానికంగా ఉన్న మారిక స్కూల్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తోంది. కొన్నాళ్లుగా మేరీ-రూమా మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనికి కారణం రూమా ప్రేమలో పడ్డమే. కూతురు ప్రేమ విషయం తెలిసి మేరీ మందలించింది. దీంతో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. ఇద్దరూ కలిసి ఆమె మృతదేహాన్ని హిమాయత్ సాగర్ లో పడేశారు. ఆ తర్వాత తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు పిర్యాదు చేసింది. రుమా ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. అంతే వారి స్టయిల్ లో విచారణ చేయడం తో చేసిన పాపం తెలిపింది. దాంతో రూమాను, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు.