తేజు ప్రమాదం : నరేష్ మాటలపై బండ్ల గణేష్ ఫైర్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్ నటుడు నరేష్ మీడియా తో మాట్లాడుతూ..తేజు కు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని , తరుచు నా కొడుకుతో కలిసి వెళ్తుంటాడని నరేష్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా పలుమార్లు బైక్ రైడింగ్ చేయకూడదని చెప్పినట్లు మీడియా ముఖంగా తెలిపారు. అయితే నరేష్ మాటల ఫై బండ్ల గణేష్ మండిపడ్డారు.

“ప్రస్తుతం తేజ్ బాగానే ఉన్నారు. ఆయనకు చిన్న ప్రమాదం జరిగింది. త్వరగా కోలుకొని మంచి మంచి సినిమాలు చేస్తారు అని గణేష్ చెప్పుకొచ్చారు. ఈ టైం లో నరేష్ గారు మీరు ఆలా మాట్లాడడం కానీ ఎవరెవరో మరణించిన వారి పేర్లు చెప్పడం గాని ఏమాత్రం బాగాలేదు. ఇప్పుడు ఎందుకు సర్ తేజు అది చేసాడు..ఇది చేసాడని చెప్పడం..మా ఇంటి దగ్గరి నుండే వెళ్లారు అని చెప్పడం మంచిది కాదు. ఎందుకు సర్ ఆలా మాట్లాడడం..ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు” అని గణేష్ నరేష్ కామెంట్స్ ఫై స్పందించారు.

It’s True .please don’t do politics In this time it’s not correct it’s my humble request🙏 pic.twitter.com/ckFXWwKEE7— BANDLA GANESH. (@ganeshbandla) September 11, 2021

ఈ కామెంట్స్ తర్వాత నరేష్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసారు. తేజ్ త్వరగా కోలుకోవడం ఎంతో సంతోషంగా ..నా కుమారుడు , తేజు బైక్ రేసింగ్ లో పాల్గొనలేదు. ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లి అక్కడి నుండి ఎవరికీ వారు ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో తేజ్ ప్రమాదానికి గురి అయ్యాడు. అంతే తప్ప మరోటి లేదని నరేశ్ క్లారిటీ ఇచ్చారు.

Thank you sir 🙏 pic.twitter.com/ApmCUwu0rS— BANDLA GANESH. (@ganeshbandla) September 11, 2021