పుష్ప 2 లో ట్రైబల్​ గర్ల్​ పాత్రలో సాయి పల్లవి..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 1 ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పార్ట్ 2 షూటింగ్ నడుస్తుంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబదించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో ట్రైబల్​ గర్ల్​ పాత్రలో సాయి పల్లవి నటించబోతుందని వినికిడి. ఈ రోల్​ చేయడానికి సాయి పల్లవి పది రోజుల సమయం కేటాయించిందని సమాచారం. విభిన్న పాత్రల్లో నటించేందుకు సాయి పల్లవి ఎప్పుడు ముందుటుంది. ఇప్పటి వరకు చిన్న హీరోల పక్కన నటించిన సాయి పల్లవి..ఒకవేళ పుష్ప 2 నటిస్తే ఆమెకి ప్లస్ అవుతుందని , మరిన్ని అవకాశాలు ఆమెకు వస్తాయని అభిమానులు , సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ఇక రీసెంట్​గా సాయిపల్లవి శ్యామ్​ సింగరాయ్​, విరాటపర్వం, గర్కి మూవీల్లో కనిపించింది.