మహిళలకు లోకేష్ పాదాభివందనం

మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహిళలకు పాదాభివందనం చేసారు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనని.. అమ్మ లేనిదే మనకు జన్మ లేదు అని ఈ సందర్భాంగా లోకేష్ అన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధువారం లోకేష్ యాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగింది.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. అమ్మలేకపోతే మనకు జన్మలేదని, భూమి కన్నా ఎక్కువ భారం మహిళలు మోస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతాం. మహిళా మంత్రులే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారని, మహిళా మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను అన్నారు. మహిళలు అంటే వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు. జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 52 వేల మహిళల పై వేధింపులు జరిగాయి. మరో 900 మంది మహిళల పై అత్యాచారాలు జరిగాయి. సిఎం సొంత నియోజకవర్గం లో నాగమ్మ అనే మహిళ పై అత్యాచారం జరిగితే పోరాడిన దళిత మహిళా నాయకురాలు అనిత పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని లోకేష్ గుర్తుచేశారు.