జేపీ నడ్డాను కలవనున్న సచిన్‌ పైలట్‌ !

sachin-pilot

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ డిప్యూటీ సిఎం సచిన్‌ పైలట్‌ ఈరోజు బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్‌ సిఎం అశోక్ గెహ్లాట్‌తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో బిజెపి అధ్య‌క్షుడితో స‌చిన్ పైల‌ట్ భేటీ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు. కానీ బిజెపి వ‌ర్గాలు మాత్రం దీన్ని వ్య‌తిరేకిస్తున్నాయి. న‌డ్డా, పైల‌ట్ మ‌ధ్య ఎటువంటి భేటీకి టైం ఫిక్స్ కాలేద‌ని బిజెపి వ‌ర్గాలు పేర్కొన్నాయి. న‌డ్డా ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్నారు. స‌చిన్ పైల‌ట్ కూడా ఢిల్లీలోనే మ‌కాం వేశారు.

ఇవాళ ఉద‌యం 10.30 నిమిషాల‌కు జైపూర్ లో జ‌ర‌గ‌నున్న కాంగ్రెస్ మీటింగ్ ద్వారా తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు పైల‌ట్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సిఎం ఇచ్చిన నోటీసుల‌ను అవ‌మాన‌క‌రంగా భావించిన స‌చిన్ పైల‌ట్‌.. గెహ్లాట్‌పై తిరుగుబాటు ప్ర‌క‌టించారు. త‌న‌కు 30 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉందంటూ స‌చిన్ పైల‌ట్ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/