బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కష్టాలు : ఆఖరికి డస్ట్ బిన్‌లో ఏమైనా కనిపిస్తాయో అని లోబో వెతుకులాట

బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కష్టాలు : ఆఖరికి డస్ట్ బిన్‌లో ఏమైనా కనిపిస్తాయో అని లోబో వెతుకులాట

బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లు పెడుతూ సభ్యులను పరీక్షిస్తున్నారు. తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా వెయిట్‌ తగ్గితే గెలుపు మీదే అన్నారు. అందులో భాగంగా ఇంటి సభ్యులకు ఫుడ్‌ అందుబాటులో లేకుండా చేశారు బిగ్‌బాస్‌. వెయిట్‌ తగ్గేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. అందులో భాగంగా మధ్య మధ్యలో టాస్క్ లు, గేమ్‌లిస్తూ విన్‌ అయ్యే అవకాశాలిస్తున్నాడు.

బుధవారం ఎపిసోడ్‌లో కర్రలు నరికే టాస్క్ లో ప్రియా, ప్రియాంకలతో పోటీ పడి, విశ్వ, యాంకర్‌ రవి విన్నర్‌ అయ్యారు. అదే సమయంలో నీటిలో తేలే వస్తువులేంటి? మునిగే వస్తువులేంటో గుర్తించాలని టాస్క్ ఇవ్వగా, ఇందులో సన్నీ, మానస్‌ గెలిచారు. ఫుడ్‌ కోసం లోబో కష్టాలు అన్ని ఇన్ని కావు, ఆఖరికి కిచెన్‌లో ఎవరూ చూడని సమయంలో డస్ట్ బిన్‌ కవర్‌ని చూస్తూ అందులో ఫుడ్‌ దొరుకుతుందేమో అని చేసిన ప్రయత్నం అందర్నీ కంట తడి పెట్టించింది.

ఇంటిసభ్యులు ఆకలి బాధలను తెలియజేసేలా ఓ చిన్న స్కిట్‌ని ప్రదర్శించారు. అందులో భాగంగా విశ్వ, యాంకర్‌ రవి, నటరాజ్‌ మాస్టర్‌, ప్రియా కలిసి కమల్‌ హాసన్‌ నటించిన ఆకలి రాజ్యంలోని శ్రీదేవి తమ రూమ్‌కి వచ్చినప్పుడు కమల్‌, తన ఫ్రెండ్స్ తో కలిసి ఆకలి బాధని దాచుకుని యాక్ట్ చేసి చూపించిన సన్నివేశాన్ని బిగ్‌బాస్‌లో చూపించారు. ఈ స్కిట్‌లో విశ్వ, రవి, నటరాజ్‌ మాస్టర్‌ ఉద్యోగాల గురించి చెప్పిన విషయాలు ఆకలి బాధలను తెలియజేసిన విధానం కన్నీళ్లు పెట్టించాయి. మధ్యలో ఇంటి సభ్యుల కోసం బిగ్‌బాస్‌ బిర్యానీ పంపించాడు. దీంతో షణ్ముఖ్‌, సన్నీ, సిరి, మానస్‌, యాంకర్ రవి, నటరాజ్‌ మాస్టర్‌, శ్రీరామ్‌, హమీద ఫుడ్‌ తినలేదు. కానీ మినహా మిగిలిన వాళ్లు బిర్యానీని తిన్నారు. మొత్తంగా ఎక్కువ కిలోలు తగ్గిన మూడు జోడీల నుంచి ముగ్గురు.. సన్నీ, శ్రీరామ్‌, శ్వేత కెప్టెన్సీకోసం పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. వీరిలో శ్రీరామచంద్ర నాలుగో కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు. చూద్దాం ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరుగుతుందో.