బీరకాయ ఇగురు

రుచి: కొత్త వంటకాలు ‘చెలి’ పాఠకులకు

Ridge gourd iguru

కావలసిన పదార్థాలు

బీరకాయలు – 500 గ్రాములు
ఉల్లిపాయలు -2
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 2 రెబ్బలు
పసుపు – పావ్ఞ టీ స్పూన్‌
కారంపొడి – 1 టీ స్పూన్‌
అల్లంవెల్లుల్లి ముద్ద – 1 టీ స్పూన్‌
గరం మాసలా పొడి – పావ్ఞ టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
నూనె – 3 టీ స్పూన్‌లు

తయారు చేసే విధానం

బీరకాయలు పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.

ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిముద్ద వేసి కొద్దిగా వేయించి కారంపొడి, బీరకాయముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

బీరకాయలు లేతగా ఉంటే చిన్న మంట మీద ఉడికిస్తే నూనెలోనే మగ్గిపోతాయి.

లేదా అవసరమైతే ముక్కలు కాస్త మెత్తబడ్డాక అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టి నిదానంగా ఉడికించాలి. చివరగా గరం మసాలా పొడి వేసి దించేయాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/