యాక్నే తగ్గించే కొబ్బరి నూనె

అందమే ఆనందం

benefits of coconut oil
benefits of coconut oil

సహజంగా లభించే కొబ్బరి నూనెలో అందాన్ని మెరుగు పరిచే సుగుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీ బాక్టేరియల్ , యాంటీ ఫంగస్ చర్మానికి , జుట్టుకి మేలు చేస్తాయి. చర్మం నిర్జీవంగా పొడిబారినట్టు కన్పిస్తుంటే అర కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు గులాబీ రేఖలు వేసి మరిగించండి. తర్వాత చెంచా తేనే కలిపి ఒంటికి రాసుకునే కాసేపు మర్దన చేస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. పొడిబారే సమస్య అదుపులోకి వస్తుంది.

గోరు వెచ్చని కొబ్బరి నూనెలో కొద్దిగా బేబీ ఆయిల్ రెండు చుక్కల గులాబీ నూనె కలిపి ఉదయాన్నే ముఖానికి రాయండి. కాసేపు మర్దన చేయండి. ఇది సహజ క్లీనర్ ల పనిచేస్తుంది. యాక్నే తగ్గుముఖం పడుతుంది. జట్టు ఆరోగ్యం గా నల్లటి నిగారింపు మెరిసి పోవాలంటే కొబ్బరి నూనె లో గుప్పెడు మందార నువ్వులు, చెంచా చొప్పున ఆముదం , అలివ్ ఆయిల్ కాసిని మెంతులు వేసి మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నపుడు దీన్ని కుదుళ్ళ నుంచి చివర్ల దాకా రాసి మర్దనచేయాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/