తొలినాళ్లలో భాధతో రాత్రంతా ఏడ్చా..

కేరీర్‌ ప్రారంభరోజులను గుర్తు చేసుకున్న కోహ్లీ

virat kohli
virat kohli

హైదరాబాద్‌: ప్రస్తుత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాందించుకున్న క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, ఇదంతా నాణేనికి ఒకవైపు. ఒకానోక సమయంలో కనీసం స్టేట్‌ టీంకు కూడా సెలెక్ట్‌ కాలేకపోయానని కన్నిటీ పర్యంతమయిన క్షణాలు కూడా ఉన్నాయని కోహ్లి తెలిపాడు. అన్‌ అకాడమీ నిర్వహించిన ఆన్‌లైన్‌ సెషన్‌లో విరాట్‌ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి పాల్లోన్నాడు. ఈ సందర్బంగా తన కేరిర్‌ ప్రారంభంలో ఎదుర్కోన్న ఒడిదుడుకులను చెప్పుకొచ్చాడు. కేరీర్‌ ప్రారంభంలో తొలిసారి స్టేట్‌ టీమ్‌ సెలక్షన్స్‌లో పాల్లోన్న నాకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్స్‌లో నన్ను రిజెక్ట్‌ చేశారు. దాంతో ఆరోజు రాత్రంతా ఏడ్చాను. పరుగులు బాగా చేసినప్పటికి జట్టులోకి తీసుకోక పోవడంతో చాలా భాధపడ్డాను, కోచ్‌తో కూడా రెండు గంటలు మాట్లాడాను. ఎందుకు సెలెక్ట్‌ చేయలేదని కూడా అడిగాను. ఆ తర్వాత ఇంటికెళ్లి ఇలా ఎందుకు జరిగిందని తీవ్రంగా ఆలోచిస్తు భాదపడ్డానని చెప్పాడు. కాని ఆటపై నాకున్న అంకితభావం నన్ను మళ్లీ ఈ స్థాయిలో నిలబెట్టిందని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/