కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన కేంద్రమంత్రి


Cabinet Briefing by Union Minister Prakash Javadekar

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నేపథ్యంలో ప్రధాని మోడి నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే కేబినెట్‌ కీలక చర్చల అనంతరం నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాకు వెల్లడించారు. ‘కరోనా‘ బాధితులకు ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందిస్తామని చెప్పారు. ‘కరోనా’ బాధితులకు సేవలందిస్తున్న  వైద్య సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఎవరైనా వారిపై దాడి చేస్తే సహించేది లేదని, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని, రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని తెలిపారు. ‘కరోనా’ విధుల్లో ఉన్న అన్ని రకాల సిబ్బందికి రూ.50 లక్షల వరకు వైద్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/