ఆర్టీసి ఎండీ సజ్జనార్‌ ను ఫిదా చేసిన లేడి కండక్టర్

ఆర్టీసి ఎండీ గా సజ్జనార్‌ భాద్యతలు చేపట్టిన దగ్గరి నుండి ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అనేక ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఆర్టీసీ ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అంతే కాదు ఎప్పటికప్పుడు కండక్టర్ల తీరుపట్ల ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఓ లేడి కండక్టర్ చేసిన పనికి ఫిదా అయ్యాడు. ఓ స్కూల్ విద్యార్థిని స్కూల్ టైం అవుతుండడం తో జడ వేసుకోకుండానే స్కూల్ కు స్టార్ట్ అయ్యింది. ఆలా జడ వేసుకోకుండ బస్సు ఎక్కింది. ఇది గమనించిన బస్సు కండక్టర్ బస్సులోనే బాలికకు జడవేసారు.

షాద్ నగర్ డిపోకు చెందిన కండక్టర్ సురేఖారాణి టికెట్లు తీయటం అయిపోగానే.., వెనుక సీట్లో కూర్చుని కదులుతున్న బస్సులోనే బాలికకు జడవేసింది. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు సెల్‌ఫోన్‌లో వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఈ వీడియో కాస్త సజ్జనార్ దృష్టికి వెళ్ళింది. అంతే కండక్టర్ చేసిన పనికి ఆయన ఫిదా అవుతూ ఆమెకు అభినందనలు తెలిపారు.