దీపావళి సందర్భాంగా రావణాసుర నుండి క్రేజీ అప్డేట్..

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర నుండి రేపు దీపావళి సందర్బంగా క్రేజ్ అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతుండగా.. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా క్రేజీ అప్డేట్ ను దీపావళి కానుకగా అంటే రేపు ఉదయం 10.08 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది. మరి ఆ అప్డేట్ ఏంటి అనేది చూడాలి.