షణ్ముఖ్ ..బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం ఆ పనిచేసాడు

బిగ్ బాస్ సీజన్ 5 లో ఓ సభ్యుడి గా షార్ట్ ఫిలిమ్స్ పాపులర్ షణ్ముఖ్ ..హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నుండి కూడా తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అయితే హౌస్ లో ఉన్న సభ్యులు ఏదోక సందర్భంలో కన్నీరు పెట్టుకున్నారు. కానీ షణ్ముఖ్ మాత్రం ఇంతవరకు కన్నీరు పెట్టుకోలేదు. ఫస్ట్ టైం ఆదివారం కన్నీరు పెట్టుకున్నారు.

ఆరో వారానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో లోబో, వీజే సన్నీ, ప్రియాంక, రవి, విశ్వ, శ్రీరామ్, షణ్ముఖ్, జస్వంత్, శ్వేతా వర్మ, సిరి హన్మంత్‌లు ఉన్నారు. వీళ్ల నుంచి ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో శ్వేత వర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలో షణ్ముఖ్ కన్నీరు పెట్టుకున్నారు.ఏడుపును ఎంత కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నా.. కన్నీళ్లు మాత్రం ఆగలేదు. చివర్లో సిరి హన్మంత్.. శ్వేతా వర్మ ఉన్నప్పుడు ఒకరు సేఫ్ అయి.. మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఆ సమయంలో తన ఫ్రెండ్ సేఫ్ అయినందుకు షన్నూ ముందుగా సంతోషించాడు. ఆ తర్వాత శ్వేతను చూస్తూ ఎమోషనల్ అయిపోయాడు. దీంతో ఎప్పుడూ సిరితోనే ఉండే షణ్ముఖ్‌కు శ్వేతతో కనెక్షన్ ఎక్కడ కుదిరింది అని అంతా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న సన్నివేశాలను ఎందుకు చూపించలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక స్టేజీ మీద‌కు వ‌చ్చిన శ్వేత‌తో సైన్ గేమ్ ఆడించాడు నాగ్‌. ర‌వి వెరీ స్మార్ట్ అని, అత‌డికి దూరంగా ఉండాల‌ని కంటెస్టెంట్ల‌ను హెచ్చ‌రించింది శ్వేత‌. హౌస్‌లో మాన‌స్ డేంజ‌ర్ అని అభిప్రాయ‌ప‌డింది, త‌క్కువ మాట్లాడి ఎక్కువ ఆడాల‌ని యానీ మాస్ట‌ర్‌కు స‌ల‌హా ఇచ్చింది. నిన్ను టాప్ 5లో చూడాల‌నుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చింది. శ్రీరామ్‌కు త్వ‌ర‌గా రీచార్జ్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అత‌డిని టాప్ 5లో చూడాల‌నుకుంటున్నానంది.