ఆర్టీసీ ఉద్యోగులను ఎవరినీ తొలగించలేదు

ఉద్యోగులను తొలగించారనే వదంతుల్లో నిజం లేదు..మంత్రి పేర్ని నాని

Ap Minister Perni Nani
Ap Minister Perni Nani

అమరావతి: ఏపిలో ఆర్టీసీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ వస్తున్న వదంతులకు ఏపి రవాణ శాఖ మంత్రి పేర్ని నాని  క్లారిటీ ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవ్వరినీ తొలగించట్లేదని మంత్రి ఈరోజు తెలిపారు. అయితే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేదని, అందువల్ల పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు వినియోగించుకోవాలని సర్క్యులర్ జారీ చేసినట్టు చెప్పారు. దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీకి వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల మాత్రమే వేతనాలు చెల్లించలేకపోయామని తెలిపారు. ఆర్టీసీలో ఎవరినీ తొలగించట్లేదని, అందరూ యథావిధిగా కొనసాగుతారని మంత్రి వివరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/