ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the People
Voice of the People

ముఖ్యాంశాలు

  • పెరుగుతున్న అప్పుల బాధలు
  • ఫీజులను అదుపు చేయాలి
  • పాశ్చాత్య నాగరికతవైపు యువత మొగ్గు

పెరుగుతున్న అప్పుల భారం:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసినా రాజకీయ పార్టీలు ఎన్ని కలకు ముందు ఉచిత పథకాలను ఎడాపెడా ప్రకటించేస్తున్నాయి.

అధికారంలోకి వచ్చాక పార్టీలు తమ హామీలను నిలబెట్టు కునేందుకు ఎడాపెడా అప్పులు చేసేస్తున్నాయి. అందుకే రాష్ట్రాల రుణభారం ఏటా పెరిగిపోతోంది.

2016-17 సంవత్స రంలో 38 లక్షల కోట్ల రుణభారం 2019-20 ఆర్థిక సంవ త్సరంలో 53లక్షల కోట్లకు పెరగడం పట్ల నీతి ఆయోగ్‌తో పాటు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రుణగ్రస్త రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌, మహా రాష్ట్ర, పశ్చిమబెంగాల్‌,తమిళనాడు, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లు తొలి ఆరుస్థానాలలో ఉన్నాయి.

అప్పుల భారాన్ని తగ్గించేం దుకునేందుకు రాష్ట్రాలు జిఎస్టీని పెంచాలని డిమాండ్‌ చేయ డం ప్రజాసంక్షేమ స్ఫూర్తికి విరుద్ధం.

ఫీజులను అదుపు చేయాలి:-కె.రామకృష్ణ, నల్గొండ

తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుంటే ప్రైవేట్‌ రంగంలో మాత్రం దినదినాభివృద్ధిచెందుతోంది.వ

ిద్యాసంవత్సరం పూర్తికాకుండానే వచ్చే సంవత్సరం కోసం అభ్యసన ప్రక్రియ జోరందుకుంది. ప్రతి సంవత్పరం ఫీజులు, ఇతర సుంకాలను దాదాపు 25 శాతం పెంచుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవ్ఞతున్నాయి.

ఇప్పటికే పెరిగిన ఫీజుల భారం మోయలేని తల్లిదండ్రులు చేస్తున్న విజ్ఞప్తులు బుట్టదాఖలు అవ్ఞతున్నాయి.

లొసుగుల కారణంగా ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేస్తున్నాయి. గ్రామాల్లో సైతం ఫీజుల దోపిడీ జోరందుకుంది.

పాశ్చాత్య నాగరితవైపు యువత మొగ్గు:-కాశీ అన్నపూర్ణ, విశాఖపట్నం

నేటి సమాజం పాశ్చాత్య నాగరికత వైపు అడుగులేస్తోంది. కంప్యూటర్‌ చదువులు, టెక్నికల్‌ కోర్సులు, విదేశీ భాషా కోర్సులు విదేశీ కోర్సులు వగైరా మార్పులకు అనుగుణం గా మారడం తప్పుకాదు.

కాని భారతదేశంలో మార్పులు రావడం దురదృష్టకరం. చదువ్ఞలు ఉపాధి కోసం మార వచ్చు.కానీ భారతీయతను వదిలి పాశ్చాత్య సంస్కృతు లపై ఆకర్షణ పెరుగుతోంది.

నేడు సహజీవనం, అక్రమ సంబంధాలు,డేటింగ్‌,చాటింగ్‌లు, వివాహనం చేసుకుంటా మని ఆర్థికంగా మోసగించేవారూ ఎక్కువవ్ఞతున్నారు.

వెనుకబడుతున్న గ్రామాలు:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

నేటికీ రహదారులు, విద్య, వైద్యం, సురక్షిత తాగునీరు లేని గ్రామాలు దేశంలో అయిదు వేల దాకా వు న్నాయన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ తాజా నివేదిక ఈ పథకాల అమలులో వైఫల్యం, నిర్లక్ష్యాలను తెలియచేస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలలో మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామాలలో అయితే కనీస మౌలిక సదుపాయాలు లేకుండా అధ్వాన్నంగా బతుకుఈడుస్తున్న ప్రజలు ఎందరో ఉన్నారు.

నీటికోసం కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దౌర్జన్యం, ప్రాణాంతక వ్యాధులు ప్రబలితే ఎలాంటి వైద్యం అందక ప్రాణాలు కోల్పో వాల్సిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి.

ప్రభుత్వాలు ఖర్చుచేసే వేల కోట్లు ఈ గ్రామాలకు ఎందుకు లభించడం లేదన్న దానిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

ప్లాస్టిక్‌ను పారేద్దాం: -సయ్యద్‌ షఫీ, హన్మకొండ

మన పూర్వీకులు ప్రకృతివనరులతో తయారు చేసిన వస్తువ్ఞ లను ఉపయోగించేవారు. నేటి ఆధునిక యుగంలో ప్రజలు ప్లాస్టిక్‌ వస్తువ్ఞల మోజులో పడ్డారు.

ఈ రోజు మనం కూర్చునే కుర్చీ నుండి తినే ఆహార పాత్రల వరకు ప్లాస్టిక్‌ వాడుతున్నాం.

ప్లాస్టిక్‌ వస్తువ్ఞలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. వాడ డం, పారేయడానికి అలవాటు పడిన ప్రజలు మట్టితో చేసిన వస్తువులు వాడటానికి ఇష్టపడటం లేదు.

ప్లాస్టిక్‌ మనకే కాదు భూమిని కూడా పాడుచేస్తుంది.

వాడిపారేసిన ప్లాస్టిక్‌ మట్టిలో కలవకపోగా అలాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి.

చెరువ్ఞలు కాలువలు జలాశయాలు కలుషితంఅవడంతో అందు లోనిజీవరాశులు చనిపోతున్నాయి. కాబట్టిప్లాస్టిక్‌ను నివారిద్దాం.

పథకాల అమలులో జాప్యం: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రభుత్వ ఫ్లాగ్‌ షిప్‌ పథకంగా ప్రచార్భాటాలను అందుకుంటున్న మహా త్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ కూలీలకుఊతం ఇవ్వలేకపోతోంది.

ఉపాధి పథకం పనులు చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికను సమర్థంగా అమ లు చేయకపోవడంతో పేద కుటుంబాలకు పని కల్పించడం కూడా క్రమంగా తగ్గిపోతోంది.

దీంతో కేంద్రం అమలు చేస్తున్న పథకం లక్ష్యం నెరవేరడం లేదు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/