కరోనాతో 560కి చేరినా మృతులు

Coronavirus
Coronavirus

చైనా: చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ తో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. అయితే చైనాలో కరోనా వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 560 మంది మృతి చెందారు. హుబే రాష్ట్రంలో మరో 70 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కేంద్రమైన హుబేలో కొత్తగా 2,987 కేసులు నమోదు అయ్యాయి. చైనాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 27,378 దాటింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు.

తాజా ఆధ్మాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/