కెసిఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశం

RS Praveen Kumar meeting with KCR

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌ను బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సమయంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని… నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి కలయిక ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్, బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.