ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్ లక్ష్యo

Minister Nirmala sitaram

New Delhi: ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్ సభలో బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ప్రజల ఆదాయం పెంచేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయన్నారు.

ఇది సామాన్యుల బడ్జెట్‌:

నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-2021 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ ఇది సామాన్యుల బడ్జెట్‌ అని పేర్కొన్నారు. ఆర్థిక ప్రగతికి సంస్కరణలు అవసరమన్నారు. ప్రజల ఆదాయం పెంచేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్‌ లక్ష్యమన్నారు. జీఎస్టీ చారిత్రాత్మక నిర్ణయమన్నారు.

జిఎస్‌టి అమలుతో ప్రజలపై తగ్గిన పన్ను భారం 

జిఎస్‌టి అమలుతో ప్రజలపై పన్ను భారం తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆర్థిక సంస్కరణల్లో జిఎస్‌టి చాలా కీలకమైనదని ఆమెచెప్పారు. జిఎస్‌టి అమలుతో ప్రజలకు లక్ష కోట్లలబ్ధి చేకూరిందని ఆమె అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేశామని ఆమె చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టామన్నారు.

జీఎస్టీతో పెరిగిన ఆదాయం, పన్ను చెల్లింపులు ఏప్రిల్ నుంచి మరింత సరళం

ఆదాయం పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్ రూపొందింంచినట్లు చెప్పారు. యువతను శక్తిమంతం చేయడమే ప్రభుత్వ పాధాన్యత అని నిర్మాలా సీీతారామన్ చెప్పారు. జీఎస్టీ వల్ల కేంద్రం ఆదాయం పెరిగిందనీ, అదే సమయంలో ఎవరికీ నష్టం జరగలేదని వివరించారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం మంచి ఫలితాన్నిచ్చిందని నిర్మాలా సీతారామన్ అన్నారు. ఇన్ స్పెక్టర్ రాజ్ కు కాలం చెల్లిందనీ, అందులో భాగంగానే పలు చెక్ పోస్టులను ఎత్తివేశామన్నారు. అలాగే ప్రజలపై దాదాపు పది శాతం వరకూ పన్నుభారం తగ్గిందన్నారు. అలాగే జీఎస్టీ వల్ల గత రెండేళ్లలో కొత్తగా 16లక్షల మంది పన్ను చెల్లింపు దారులు పెరిగారని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం, సరళతరం చేస్తామని నిర్మల చెప్పారు.

జిఎస్‌టి చారిత్రాత్మక సంస్కరణ

జిఎస్‌టి చారిత్రాత్మక సంస్కరణ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. జిఎస్‌టి విషయంలో మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్‌ జైట్లీ ముందు చూపుతో వ్యవహరించారని ఆమె చెప్పారు. జిఎస్‌టితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాభపడ్డాయని ఆమె చెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/