అండ‌ర్‌వాట‌ర్ మెట్రో ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ

Prime Minister Modi will start the underwater metro

న్యూఢిల్లీ: కోల్‌క‌త్తాలో నిర్మించిన అండ‌ర్‌వాట‌ర్ మెట్రో ట‌న్నెల్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రేపు ప్రారంభించ‌నున్నారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్ల‌నేడ్ మెట్రో సెక్ష‌న్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ట‌న్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా వ్య‌వ‌స్థ సుల‌భ‌త‌రం కానున్న‌ది. సాంకేతికంగా క్లిష్ట‌మైన రూట్లో నిర్మాణాన్ని చేప‌ట్టారు. అండ‌ర్‌వాట‌ర్ మెట్రోతో పాటు క‌వి సుభాష్‌- హేమంత ముఖోపాధ్యాయ మెట్రో స్టేష‌న్‌, త‌ర‌తాలా-మ‌జేర్‌హ‌ట్ మెట్రో సెక్ష‌న్‌ను ప్ర‌ధాని మోడీ ప్రారంభించ‌నున్నారు. కోల్‌క‌తా నుంచే మోదీ అనేక మెట్రో ప్రాజెక్టుల‌ను కూడా ప్రారంభిస్తారు.