ఆచార్య నుండి సాన కష్టం ఐటెం ప్రోమో రిలీజ్

ఆచార్య నుండి సాన కష్టం ప్రోమో వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్షన్ చేస్తుండడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా..ఆయనకు జోడి గా పూజా హగ్దే నటిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘లాహే లాహే’ , ‘నీలాంబరి’ పాటలు విడుదలై శ్రోతలను విశేషంగా అలరించాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. మేకర్స్ ‘ఆచార్య’ సినిమాలోని మూడో పాటను రిలీజ్ చేస్తున్నారు. ‘సానా కష్టం’ అనే పాట లిరికల్ వీడియోని జనవరి 3వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ తరుణంలో ఆదివారం ఈ సాంగ్ తాలూకా ప్రోమో ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. ఈ స్పెషల్​ సాంగ్​లో రెజీనాతో కలిసి స్టెప్పులేస్తున్న చిరు.. ఆడియెన్స్​తో గోల పెట్టించేందుకు రెడీ అయిపోతున్నారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ లో చిరు తో పాటుగా హీరోయిన్ రెజీనా కాసండ్రా ఆడిపాడనుందని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

YouTube video