ప్రారంభమైన సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

Superstar Krishna’s Last Rites

హైదరబాద్ః సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. పద్మాలయా స్టూడియోస్ నుంచి ఆయన పార్థివదేహం బయల్దేరింది. ఈ సందర్భంగా ఆయనను కడసారి చూసుకునేందుకు వచ్చిన అభిమానులందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. భారీ భద్రత మధ్య యాత్ర కొనసాగుతోంది. పూలతో అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహం ముందు కదులుతుండగా… వెనుక ఆయన కుమారుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితుల వాహననాలు అనుసరిస్తున్నాయి. మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమక్రియలు జరగనున్నాయి. మరోవైపు, అంతిమయాత్ర కొనసాగుతున్న మార్గం మొత్తం జనసంద్రమైంది. రోడ్డుకిరువైపులా జనాలు నిలబడి కృష్ణకు వీడ్కోలు పలుకుతున్నారు. జోహార్ కృష్ణ అంలూ నినదిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/