మంచు విష్ణు ”మా” ఎన్నికల మేనిఫెస్టో విడుదల..

రాజకీయ పార్టీలు మాత్రమే ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ను విడుదల చేస్తారని అనుకుంటారు. కానీ మూవీ అసోషియేషన్‌ ఎన్నికల్లోను మేనిఫెస్టో విడుదల చేసి ఆకట్టుకుంటారు. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా మా బరిలో నిల్చున్న మంచు విష్ణు మేనిఫెస్టో ను విడుదల చేసి ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ… తమ మేనిఫెస్టో లో మొదటి ప్రాధాన్యత అవకాశాలైన మా ఆప్ రెడీ చేస్తామని.. జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. మా భవనాన్ని తన సొంత డబ్బు కడతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని… భవిష్యత్ అవసరాలు తీర్చేలా మా భవనం కడతామని స్పష్టం చేశారు.

సభ్యుల పిల్లలకు మంచి విద్య అందిస్తామని.. అర్హుల పిల్లలకు కేజీ టూ పిజి ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. అలాగే అర్హులైన వారందరికీ కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు. మహిళల రక్షణ కోసం హై పవర్ విమెన్ గ్రీవిన్స్ సెల్ ఏర్పాటు, వృద్ధ కళాకారుల కు ఫెన్షన్ కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికి ఓటు హక్కు లేని వాళ్లకు ఓటు హక్కు కల్పిస్తామని… మా మెంబర్షిప్ కార్డ్.. లక్ష నుంచి 75 వేలకు తగ్గింపు చేస్తామని హామీ ఇచ్చారు. మా ఉత్సవాలు, కేంద్ర రాష్ట్ర పథకాలు, మోహన్ బాబు ఫిల్మ్ ఇనిస్ట్యూట్…. లో మూవీ మెంబర్ల పిల్లలకు 50 శాతం స్కాలర్ షిప్ ఇప్పిస్తామన్నారు. మా సభ్యులకు సొంతింటి కళ నేరవేర్చేందుకు కృష్టి చేస్తామన్నారు. వైద్య సహాయంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం కార్పొరేట్ ఆస్పత్రులతో మాట్లాడుతున్నామని.. ప్రతి మూడు నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.