ఎస్‌ఇసి ‘నిమ్మగడ్డ’ లేఖాస్త్రాలు

జిల్లాల్లో మంత్రుల పర్యటనకు నో! ..ఎమ్మెల్యేలకూ కోడ్‌ వర్తింపు… ప్రవీణ్‌ ప్రకాష్‌ను తొలగించాల్సిందే

Nimmagadda Ramesh Kumar
Nimmagadda Ramesh Kumar


Amaravati:: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎస్‌ఇసి నిమ్మగడ్డ వ్యహారశైలిపై అధికారపార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్న సమయంలో ఆయన మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఈసారి మంత్రులనే టార్గెట్‌గా చేసుకున్నారు.

తొలిదశ పంచాయతి ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ప్రవర్తనా నియ మాళి సరిగ్గా అమలు కావడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు ఎస్‌ఇసి మరో లేఖ రాశారు. పంచాయతి ఎన్నికల జరిగే గ్రామాల్లో మంత్రులు పర్యటించకూడదని ఎస్‌ఇసి ఆదేశించారు. ఎన్నికల నియమావళిని నిఖ్కచ్ఛిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉం దని ఆయన స్పష్టం చేశారు. తన జిల్లాల పర్య టలో కోడ్‌ సక్రమంగా అమలు కావడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఎన్నికలు జరిగే ప్రాంతాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులూ దూరంగా ఉండాలని ఆయన ఆదే శాలు జారీచేశారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో పర్యటించిన సమయంలో తాను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చొరవతోనే రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసి, కీల కమైన ఫైళ్లపై సంతకాలు చేశానని, అభ్యంతరా లపైనా తాను వైఎస్‌ఆర్‌తో చర్చించి ఆమోదం పొందానని, కీలకమైన విషయాల్లో తాను కోర్టులో ముఖ్యసాక్షిగా ఉన్నాయని, భవిష్యత్తులోనూ తన పంథాను మార్చుకోవాల్సిన పనిలేదని, తనకు రా జ్యాంగపరంగా రక్షణ కూడా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడంతో అధికారపార్టీని ఇరుకున పెట్టా రని పలువురు వ్యాఖ్యానించారు.

ఒకవైపు ఎన్నికల కమిషనర్‌ రెండు రోజులుగా జిల్లా పర్యటనలకు వెళ్లి అక్కడి ఎన్నికల ప్రక్రియపై జిల్లాల ఉన్నతా ధికారులతో సమావేశాలు నిర్వహిస్తునే మరోవైపు ప్రభుత్వపెద్దలకు లేఖలు రాయడం, రాష్ట్ర హైకో ర్టులో ధిక్కరణ కేసులో ప్రతివాదిగా రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాథ్‌ దాస్‌ పేరును చేర్చాలన్న పిటిషన్‌ వేయడం, అందుకు హైకోర్టు శుక్రవారం అనుమతివ్వడం చకచకా జరిగిపో యాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై అసెంబ్లీ స్పీకర్‌ కార్యాల యంలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌ను స్వీక రించిన హైకోర్టు ప్రతివాదిగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ పేరును చేర్చ డానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలను రద్దుచేయాలంటూ హైకోర్టులో దాదాపు 10 పిటిషన్లు దాఖలైనట్లు సమాచారం. దీంతో ఎన్నికలను అడ్డుకోవాలని చివరి ప్రయ త్నాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం పంచాయితీ ఎన్నికలను రీషెడ్యూల్‌ చేసిన ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ దూకుడు పెంచుతూ అధికారులపై హుకూం జారీ చేస్తున్నారు. ఒకరిద్దరు కాదు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉన్న అందరినీ టార్గెట్‌ చేస్తున్నారంటూ అధికారపార్టీ నేతలు, పెద్దలు వాపోతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/