మహబూబ్‌నగర్‌లో భారీగా పట్టుబడ్డ మద్యం

ఎన్నికల వేళ మహబూబ్‌నగర్‌లో భారీగా మద్యం పట్టుబడింది. వీటి విలువ దాదాపు రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది. ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం, అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఈక్రమంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో దానిని సీజ్‌చేశారు. దాని విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలిపారు.