బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు అయింది. ప్రచారంలో భాగంగా అర్వింద్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండల ఎలక్షన్‌ ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జి విజయేంద్రరావు ఫిర్యాదు చేయడం తో.. ఈ మేరకు ఎంపీపై కేసు నమోదు చేసినట్టు జగిత్యాల టౌన్‌ సీఐ తెలిపారు.

ఈ నెల 8న పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అర్వింద్‌ ప్రసంగిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి హిందువులకు ప్రమాదకారంగా మారాడని.. జగిత్యాల పీఎఫ్‌ఐకి అడ్డాగా మారిందని.. జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండల ఎలక్షన్‌ ఎఫ్‌ఎస్‌టీ ఇన్‌చార్జి విజయేంద్రరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీ అర్వింద్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ వేణుగోపాల్‌ తెలిపారు.