ఆర్ఆర్ఆర్ ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత దానయ్య

ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రానేలేదు..అప్పుడే ఓటిటి లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చెప్పేసారు నిర్మాత దానయ్య. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున అనేక భాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ఫై దృష్టి సారించారు. ఈ తరుణంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఫై క్లారిటీ ఇచ్చారు నిర్మాత.

ప్రస్తుతం పెద్ద సినేమైనా, చిన్న సినేమైనా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ వేదికల్లోకి వచ్చేస్తోంది. అయితే రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ”ఆర్.ఆర్.ఆర్” సినిమా మాత్రం రెండున్నర నెలల నుంచి మూడు నెలల తరువాతే డిజిటల్ వేదిక మీదకు వస్తుందని మేకర్స్ తెలిపారు. అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని హిందీలో సమర్పిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత నిర్మాత జయంతిలాల్ కూడా ఓటిటి రిలీజ్ గురించి స్పందించారు. “RRR సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన 75 నుండి 90 రోజుల తర్వాత ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది. ప్రజలు చాలా కాలం పాటు సినిమా హాళ్లలో దీనిని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాము. అందుకే మేము 30 రోజుల ప్రీమియర్ ని ఎంచుకోలేము” అని జయంతి లాల్ అన్నారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ మూడు నెలల తర్వాత ఓటిటి లో వస్తుందని తేల్చేసారు.