అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న ప్రభాస్..

ఏంటి నిజమా ..? బాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా..? ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు..? పెళ్లి ఎప్పుడు..? ఇలా రకరకాలుగా మనసులో అనుకోకండి. మీము చెప్పేది పెళ్లి గురించి కాదు కొత్త ఇల్లు గురించి. అవును ప్రభాస్ అతి త్వరలో కొత్త ఇంట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొన్న ప్రభాస్.. హైదరాబాద్ లో కూడా ఒక విలాసవంతమైన విల్లాను సిద్ధం చేసుకుంటున్నాడట.. దానికోసం హైదరాబాద్ నానక్ రామ్ గుడాలో రెండు ఎకరాలను 120కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ స్థలంలో తనకు ఇష్టమైన విధంగా, అన్ని సదుపాయాలతో ఈ విల్లాను నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆ ఇంటి నిర్మాణం కోసం దాదాపు 80కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తుంది0. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. కొద్దిగా తీరిక దొరకగానే ఇంటి ప్లాన్ మీద వర్క్ చేయనున్నాడట. ఇక సినిమాల విషయానికి వస్తే..సంక్రాంతి బరిలో జనవరి 14 న రాధే శ్యామ్ మూవీ తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం లోని పలు సాంగ్స్ వచ్చి శ్రోతలను అలరిస్తున్నాయి.