ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా నిర్ధారణ
చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం

Rajamahendravaram: సంగం డెయిరీలో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/