ఆర్ఆర్ఆర్ నాల్గు వారాల కలెక్షన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ లు నట విశ్వరూపం చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నారు. సినిమా విడుదలై నాల్గు వారాలు పూర్తి అయినప్పటికీ ఇంకా థియేటర్స్ లలో అదే సందడి నెలకొంది ఉంది.

ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ.350 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ చిత్ర షేర్ రూ.600 కోట్లకు పరిమితమైంది. మన దేశంలో మాత్రమే రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ వార్తల్లో నిలిచింది.