సంక్రాంతికి స్టార్ట్ అంటోన్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్థినకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాకే తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ట్ చేయాలని రాజమౌళి ఆర్డర్ వేశాడట. కానీ ఆర్ఆర్ఆర్ అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యం అవుతుండటంతో తన 30వ చిత్ర షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు జక్కన్ను తెలిపాడట తారక్. దీనికి రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో సంక్రాంతి నాడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాబోయే సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు తారక్ రెడీ అవుతున్నాడట. ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో హడావుడి మొదలయ్యింది. తమ అభిమాన హీరో తన నెక్ట్స్ చిత్రాన్ని పండగ పూట ప్రారంభిస్తుండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని వారు అంటున్నారు. మరి నిజంగానే సంక్రాంతి నాడు తారక్ తన నెక్ట్స్ చిత్ర షూటింగ్‌ను ప్రారంభిస్తాడా లేడా అనేది చూడాలి.