గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు..ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కూ 18.95 శాతం పోలింగ్

voting-underway-for-89-seats-in-first-phase-in-gujarat

అహ్మదాబాద్‌ః గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తొలి విడ‌త పోలింగ్ కొనసాగుతుంది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కూ 18.95 శాతం పోలింగ్ న‌మోదైంది. సౌరాష్ట్ర‌-క‌చ్ ప్రాంతంలోని 19 జిల్లాల్లో విస్త‌రించిన 89 స్ధానాల్లో తొలి విడ‌త పోరు జ‌రుగుతోంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల‌కు ముగుస్తుంది. తొలి విడ‌త పోలింగ్‌కు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు అగ్ర నేత‌లు, స్టార్ క్యాంపెయిన‌ర్ల‌తో ప్రచారాన్ని హోరెత్తించాయి. కాంగ్రెస్ త‌ర‌పున రాహుల్ గాంధీ ప్ర‌చార ర్యాలీల్లో పాల్గొన‌గా, గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్న ఆప్ త‌ర‌పున ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సుడిగాలి ప్ర‌చారం చేశారు.

ఇక పాల‌క బిజెపి త‌ర‌పున ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప‌లు ర్యాలీల్లో పాల్గొన్నారు. తొలి విడ‌త పోలింగ్‌లో మొత్తం 788 మంది అభ్య‌ర్ధులు బ‌రిలో నిలిచారు. గుజ‌రాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్ గట్లొదియ నుంచి పోటీ చేస్తుండ‌గా, ఆప్ సీఎం అభ్య‌ర్ధి ఇసుద‌న్ గ‌ధ్వి ఖంబ‌లియ నుంచి బిజెపి నేత హార్ధిక్ ప‌టేల్ విరంగాం నుంచి రివ‌బ జ‌డేజా జామ్‌న‌గ‌ర్ (నార్త్‌) నుంచి త‌మ అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/