ప్రజల సహకారం లేనిదే కరోనాను ఎదుర్కోలేము: మోదీ

భారతీయులు చేస్తున్న పోరాటంను భవిష్యత్తులో ప్రజలు కథలుగా చెప్పుకుంటారు

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా కట్టడికి భారతీయులు చేస్తున్న పోరాటంను భవిష్యత్తులో ప్రజలు కథలుగా చెప్పుకుంటారని ప్రదాని నరేంద్రమోదీ అన్నారు. ఈ ఉదయం మన్‌కీబాత్‌ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడుతు.. ప్రజల సహకారం లేనిదే కరోనాను ఎదుర్కోవడంలో ఎవరు విజయం సాధించలేరని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు బాగా అర్ధం చేసుకున్నారని అందుఏ వారి సహయ సహకారాలు అందిస్తున్నారన్నారు. దేశంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కరోనాపై యుద్దంలో ప్రజలు బాగస్వాయులయ్యారని పేర్కోన్నారు. మరికొందరు పేదలకు నిత్యం సాయపడుతున్నారు. కొంతమంది వారి పొలాలను విక్రయించి ఈ యుద్దానికి అవసరమయిన నిదులను సేకరిస్తున్నారు. కొంతమంది వారి నెలవారి ఫించన్‌లను సహయ కార్యక్రామాలకు అందిస్తున్నారు. వారి రుణాన్ని ఏ విధంగాను తీర్చుకోలేము. అని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలకు కరోనా కారణంగా కొత్త అలవాట్లు వచ్చాయని అందలో మాస్క్‌ ధరించడం తప్పని సరిగా మారిందని అన్నారు. ప్రతి ఒక్కరు ధరించాలని చెప్పడం లేదు, కాని దగ్గు, జలుబు ఉన్న వారు ధరిస్తే క్రిములు బయటకు వెల్లబోవని అన్నారు. అలాగే ప్రజలు రోడ్లమీద ఉమ్మివేయడం కూడా గణనీయంగా తగ్గిందన్నారు. పవిత్రమైన రంజాన్‌ మాసంను ముస్లిం సోదరులంతా ఇంట్లోనే ఉండి ప్రార్ధనలు జరుపుకోవాలని సూచించారు. రంజాన్‌ పండుగ ముందే ప్రజలు శుభవార్తల వింటారని, అది కరోనా అంతరించిందన్న విషయమే అవుతుందన్న నమ్మకం తనకుందని మోదీ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/