పెదనాన్న బాటలో అకిరా నందన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్..పెదనాన్న చిరంజీవి బాటలో అడుగులేస్తున్నాడు. ఈనెల 8వ తేదీన 18వ ఏటా అడుగు పెట్టిన అకిరా నందన్ ఒక్కసారిగా జనాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అకిరా సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అకిరాకు యాక్టింగ్ చేయాలనే ఆలోచన కూడా లేదు అని అతని తల్లి రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఇక అకిరా కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు రేణు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

తాజాగా అకిరా రక్తదానం చేస్తున్న పిక్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు తన తండ్రి అలాగే పెదనాన్న తరహాలోనే అడుగులు వేస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. అకిరా నందన్ మొదటి సారి రక్త దానం చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఎంతోమంది అభిమానులు యువ హీరోలు రక్తదానం చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇక మొదటి సారి అకిరానందన్ కూడా అదే తరహాలో అడుగులు వేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.