పట్టుచీరెకు రాయల్‌ టచ్‌

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

Royal touch to silk Sarees
Royal touch to silk Sarees

వెల్వెట్‌ క్లాత్‌ అంటేనే రాయల్‌ ఫ్యాబ్రిక్‌. వివాహ వేడుకల్లో సంప్రదాయపు సందడికి పెట్టింది పేరు పట్టుచీరలు.

సంప్రదాయానికి రాయల్‌ టచ్‌ అద్దితే పట్టుచీరకు సెల్ఫ్‌ బ్లౌజ్‌ లేదంటే కాంట్రాస్ట్‌ డిజైనర్‌ బ్లౌజ్‌ వాడటం మంచిది.

చీర రంగు వెల్వెట్‌ ఫ్యాబ్రిక్‌తో హాఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ను డిజైన్‌ చేయిస్తే మోడ్రన్‌ లుక్‌. ఈ కాంబినేషన్‌కి రాళ్లు పొదిగిన హారాలు మరింత అందాన్నిస్తాయి.

వెల్వెట్‌ బ్లౌజ్‌ మీద ఎంబ్రాయిడరీ వర్క్‌ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

పూసలు, జర్దోసీతో స్లీవ్స్‌ ప్యాటర్న్‌కి మాత్రమే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. పట్టుచీరకు పూర్తి కాంట్రాస్ట్‌ వెల్వెట్‌ బ్లౌజ్‌ను ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు.

పట్టుచీర రంగులో ఉన్న వెల్వెట్‌ బ్లౌజ్‌కి చేతుల భాగంలో ఆ చీర అంచు భాగాన్ని జత చేస్తే రాయల్‌ లుక్‌తో మెరిసిపోతారు.

సింపుల్‌గా మోచేతుల వరకు స్లీవ్స్‌ డిజైన్‌ చేయించుకున్నా కాస్త హెవీ ఎంబ్రాయిడరీ చేసినట్లయితే హాఫ్‌ వైట్‌ శారీస్‌కి మరిన్ని హంగులు అద్దినట్లే.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/