దాల్‌ పరోఠా

రుచి: వెరైటీ వంటకాలు

Dal Parota
Dal Parota

కావలసిన పదార్థాలు

గోధుమ పిండి – అరకేజీ, సెనగపప్పు – ఒక కప్పు, కారం – అరటీస్పూన్‌, పసుపు – చిటికెడు, మామిడికాయ పొడి – అర టీస్పూన్‌, గరం మసాలా – అర టీస్పూన్‌, జీలకర్ర పొడి – అర టీస్పూన్‌

తయారు చేయువిధానం

గోధుమపిండిలో నీళ్లపోసి మెత్తటి మిశ్రమంలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సెనగప్పును మూడు గంటపాలు నానబెట్టుకుని తరువాత మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి.

పప్పు చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

అందులో పసుపు, కారం, మామిడికాయ పొడి,గరం మసాలా, జీలకర్రపొడి,కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలుపుకుంటే స్టఫ్‌ రెడీ.

గోధుమపిండిని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వెడల్పాటి చపాతీలా చేసుకోవాలి. మధ్యలో దాల్‌ స్టఫ్‌ పెట్టి అన్ని వైపుల నుంచి దగ్గరకు మూయాలి.

ఇప్పుడు నెమ్మదిగా చపాతీ కర్రతో మళ్లీ వెడల్పుగా చేసుకోవాలి.పెనంపై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/