శానిటైజర్‌ వాడే పద్ధతి

ఇంటిల్లిపాది ఆరోగ్యం

hand washing with sanitizer'
hand washing with sanitizer’

చేతులు శుభ్రం చేసుకునేందుకు చాలా మంది శానిటైజర్స్‌ వాడుతుంటారు. మరి దీనిని ఉపయోగించేందుకు సరైన పద్ధతులు. ఉరుకుల పరుగుల జీవితంలో మనం అనేక విషయాలను మరిచిపోతుంటాము.

అందులో ముఖ్యంగా చేతులు కడుక్కోవటం. రోజు మొత్తంలో మన చేతులు అపరిశుభ్ర ప్రదేశాలెన్నిటినో తాకుతూ ఉంటాయి. డబ్బులను లెక్కపెడతాం.

డోర్‌ హ్యాండిల్స్‌ పట్టుకుంటాం. షేక్‌హ్యాండ్‌ ఇస్తూ ఉంటాం. ఒక్కోసారి చేయి అడ్డుపెట్టుకుని తుమ్మేస్తాం. దగ్గుతాం. ఇలాంటి పనులెన్నిటికో చేతులను ఉపయోగిస్తాం.

కాబట్టి సూక్ష్మక్రిముల నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాలి. భోజనం కూడా త్వరత్వరగా తింటూంటాం.

కొన్నిసార్లు చేతులు శుభ్రం చేసుకోవడం మరిచిపోతుంటాం. కానీ ఇలా చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రతి రోజు మన చేతుల్లో ఒక మిలియన్‌క్రిములు నిండి ఉంటాయి.

దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఎప్పుడూ సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం సాధ్యం కాకపోవచుచ. కాబట్టి చాలా మంది శానిటైజర్స్‌ని వాడుతుంటారు.

హ్యాండ్‌ శానిటైజర్‌లను వాడిన తరువాత నీటితో పని ఉండదు. దీని వల్ల చాలా వరకు క్రిములు నశిస్తాయి.

అందుకే ఇప్పుడు తచాలా మంది శానిటైజర్స్‌ని ఉపయోగిస్తారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనకు నచ్చి న ఫుడ్‌ దొరికే అవకాశం ఉండదు.

కాబట్టి మనలో చాలా మంది ముందు జాగ్రత్తగా పండ్లు, డ్రైఫ్రూట్స్‌, బిస్కెట్స్‌ లాంటివి దగ్గర ఉంచుకుంటారు.

ఆహారం విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మనం చేతుల శుభ్రత విషయంలో పాటించం.

ఆహారం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటామో, అదేవిధంగా చేతులు శుభ్రం చేసుకోవటం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి.

అందుకే ఎప్పుడు ఒక హ్యాండ్‌ శానిటైజర్‌ని ఉంచుకోవడం మంచిది. ఇది చాలా ముఖ్యం.

మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నా చేతులు శుభ్రంగా లేకపోతే క్రిములు శరంలోనకి వెళ్లి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి.

కాబట్టి ఆరోగ్యమైన జీవితానికి హ్యాండ్‌ శానిటైజర్‌ ఎంతో ముఖ్యం.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/