కెసిఆర్‌ ప్రభుత్వంపై గవర్నర్‌ అసంతృప్తి

కరోనా ఉద్ధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది..గవర్నర్‌

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిపై కెసిఆర్‌ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కెసిఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదన్నారు. కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందన్నారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్‌లు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తమిళిసై అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. సూచనలు చేస్తూ… ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ తమిళిసై ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/