అందుకే షర్మిల ను రంగంలోకి దించారుః రోజా

roja-fire-on-sharmila

అమరావతిః షర్మిలపై రోజా ఫైర్‌ అయ్యారు. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్ట్ ఏనని చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీ లో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ పంచెలు ఉడాదీసి కొడతా అన్నా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పెళ్లికి ఆహ్వానం ఇచ్చిందని ఆగ్రహించారు.

టిడిపి కోవర్ట్‌ అన్న రేవంత్ రెడ్డి తో ఏ మొహం పెట్టుకొని పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు. వినే వాడు వెర్రి వాడు అయితే చెప్పే వాడు షర్మిల అన్నట్లు గా మారింది షర్మిల పరిస్థితి అని.. షర్మిల కు అసలు ఏం గుర్తింపు ఉంది? ఒక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే గుర్తింపు తప్ప అంటూ మండిపడ్డారు. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోయడం విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేస్తున్నాయని…కులం, మతం, ప్రాంతం అనే తేడా చూడకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిసియన్స్ వల్ల ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాజకీయ లబ్ది కోసం గతంలో కాంగ్రెస్ తో, ఇప్పుడు బిజెపి, జనసేన తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నాడని ఆగ్రహించారు. బాబు, లోకేష్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు విని విని బోర్ కొట్టడంతో షర్మిల ను రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు.