కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఫై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం ..

కామారెడ్డిలో రెండో రోజు పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో రేషన్ షాప్ తనిఖీ చేశారు నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు తనకి తెలియదని కలెక్టర్ సమాధానం చెప్పడం తో నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీరు IAS ఆఫీసర్ అయ్యి మీకు ఎలా తెలియదు అని ప్రశ్నించారు. అరగంట టైమ్ ఇస్తాను తెలుసుకొని చెప్పమని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తోంది కదా.. ఈ విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రేషన్ షాపులో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ కలెక్టర్ జితేష్ పటేల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి రేషన్‌ షాపులకు ప్రధాని మోడీ ఫ్లేక్సీల కట్టాలని.. ఒక వేళ మోడీ ఫ్లేక్సీ కట్టకపోతే.. తానే సాయంత్రం వచ్చి మరీ.. ప్లేక్సీ కడతానని తెలిపారు.

ఇక ఇదిలా ఉంటె ఈరోజు ఉదయం కాంగ్రెస్ నేతలు కేంద్రమంత్రి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నించారు . కాన్వాయ్ కు ఎదురుగా వెళ్లేందుకు యత్నించడంతో కాంగ్రెస్ నేతలను బీజేపీ లీడర్లు అడ్డుకున్నారు . దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు రెండు పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించారు.