రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నెగ్గేది లేదు.. జగన్ తగ్గేది లేదంటూ రోజా పంచ్ డైలాగులు

వైస్సార్సీపీ మంత్రి మరోసారి చంద్రబాబు ఫై తనదైన శైలి లో పంచ్ డైలాగ్స్ పేల్చి..వైస్సార్సీపీ నేతల్లో , కార్య కర్తల్లో ఉత్సవం నింపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నెగ్గేది లేదు.. జగన్ తగ్గేది లేదంటూ పంచ్ డైలాగులు పేల్చారు. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల టీడీపీ నేతలతో పాటు నందమూరి ఫ్యామిలీ విమర్శలు చేస్తుండడంతో వారి విమర్శలకు అంతే జవాబు ఇస్తున్నారు వైస్సార్సీపీ నేతలు. ఈ క్రమంలో మంత్రి రోజా దీనిపై మరోసారి స్పందించారు.

సీఎం జగన్ ఫై మాట్లాడే అర్హత నందమూరి కుటుంబానికి లేదని రోజా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో వైద్య సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇక టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడతారని.. మగాళ్లు ఏడుస్తారంటూ రోజా ఎద్దేవా చేసారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నెగ్గేది లేదు.. జగన్ తగ్గేది లేదంటూ రోజా పంచ్ డైలాగులు వేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సరైన నిర్ణయమని రోజా పేర్కొన్నారు.