పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పోరాడాలని అధినేత పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చించి టీడీపీ కార్యాచరణ రూపొందించారు. గోదావరి వరద ముంపు, వర్షాల వల్ల ఆదివాసీలు నష్టాల్లో కూరుకుపోయారని, పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని నేతలు మండిపడ్డారు. బాధితులందరికీ వెంటనే పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గృహనిర్మాణానికి ప్రభుత్వం రూ.2 లక్షల సబ్సిడీ ఇవ్వాలి. టిడ్కో గృహాల్ని వెంటనే లబ్ధిదారులకు అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/