షర్మిల ఫై జగ్గారెడ్డి ఫైర్..

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ఫై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉంటే నీకెందుకు అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రధాని గా చూడాలనే రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరిక అని ..మరి మీరు తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా జగన్, షర్మిల ఇద్దరు తండ్రి ఆశయాలు నెరవేర్చుతున్నారా అంటూ అడిగారు. ఆస్తుల విషయంలోనూ, వై ఎస్.రాజశేఖర్ రెడ్డికి శ్రద్ధాంజలి సమయంలో జగన్, షర్మిల లు కలిసే ఉంటారు. రాజకీయం వచ్చే సరికి ఇద్దరు వేరు వేరు అంటున్నాంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

జగన్ అన్న వదిలిన బాణం అని అప్పట్లో పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి వదిలిన బాణం అంటున్నారని.. ఇప్పుడు జగన్ వదిలేసిన బాణం అయ్యిందంటూ ఎద్దెవా చేశారు. ఏపీలో జగన్, తెలంగాణలో షర్మిల బీజేపీ నాయకుల కన్నుసన్నల్లో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. షర్మిల బీజేపీ నాయకులను ఎక్కడా ప్రశ్నించలేదన్న విషయాన్ని జగ్గారెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. మోడీ, అమిత్‌షా రాజకీయ వ్యూహంలో షర్మిల పనిచేస్తున్నారని అన్నారు.