చంద్రమోహన్ మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటుః లోకేశ్

విభిన్న పాత్రలు అలవోకగా పోషించి, మెప్పించారని ప్రశంస

nara-lokesh-extends-condolences-over-chandramohan-passing-away

హైదరాబాద్‌ః ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మృతిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శని నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యనించారు. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన నటుడు చంద్రమోహన్ అని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ ఈ రోజు ఉదయం 8.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. తన కెరీర్‌లో ఆయన 939 సినిమాల్లో నటించారు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.