బతుకమ్మ వేడుకల్లో డీజే స్టెప్స్ తో అదరగొట్టిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. క‌రోనా నేప‌థ్యంలో మీడియా ముందుకు వస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెపుతూ సుపరిచితమైన శ్రీనివాస్..ఆ మధ్య క్షుద్ర పూజ‌ల్లో పాల్గొన్నారనే వార్తలతో అందర్నీ షాక్ కు గురిచేసారు. కొన్ని రోజుల పాటు ఆ వీడియోస్ , వార్తలు మీడియా లో చక్కర్లు కొట్టగా..తాజాగా ఇప్పుడు బతుకమ్మ వేడుకల్లో డీజే సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్స్ వేసి మరోసారి వైరల్ గా మారారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీనగర్‌ కాలనీలో డీఎస్‌ఆర్‌ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో డీహెచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. సాధారణంగా ఇలాంటి ఈవెంట్లలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో లాంటి పాటలు వినిపిస్తాయి. మహిళలంతా బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటారు. కానీ ఇక్కడ సీన్‌ రివర్సయింది. బతుకమ్మ పాటలకు బదులు డీజే టిల్లు మూవీలో సాంగ్స్‌ వేశారు. దానికి డీహెచ్‌ హుషారుగా స్టెప్పులు వేయడం వివాదంగా మారాయి. ప్రస్తుతం ఈ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి.