ఐపిఎల్‌ పై స్పందించిన రోహిత్‌ శర్మ

కెవిన్‌ పీటర్సన్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రోహిత్‌

rohit sharma
rohit sharma

ముంబయి: దేశంలో కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఐపిఎల్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో క్రీడాకారులంతా వారివారి ఇళ్లల్లో సేద తీరుతున్నారు. గత కొద్ది నెలలుగా ఆటకు దూరమైన రోహిత్‌శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిచ్చాడు. ఈ ముచ్చట్లలో భాగంగా ఇంగ్లాండ్‌ మాజి సారథి కెవిన్‌ పీటర్సన్‌ ఈ ఏడాది ఐపిఎల్‌ జరుగుతుందా లేదా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రోహిత్‌.. ఎవరికి తెలుసు, ఏదో ఒక సందర్బంలో భారత్‌ లో పరిస్థితులు చక్కబడితే ఐపిఎల్‌ జరిగే అవకాశం ఉంది అని సమాధానమిచ్చాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/