బ్రయంట్‌ మరణంపై 2012లోనే జోస్యం

Kobe Bryant
Kobe Bryant

కాలిఫోర్నియా: మాజీ ఎన్‌బీఏ స్టార్‌, బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్ బ్రయంట్ ఆదివారం హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో హెలికాప్టర్‌ కుప్పకూలడంతో కోబ్‌ బ్రయింట్, ఆయన 13 ఏళ్ల కుమార్తె జియానా దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో ఏడు మంది మృతి చెందారు. అయితే ప్రస్తుతం బ్రయంట్ మరణంకు సంబందించిన ఓ వైరల్ ట్వీట్ కూడా అంతే షాక్‌కు గురిచేస్తోంది. ‘బ్రయంట్ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడు’ అని డాట్ నోసో అనే ఓ ట్విట్టర్ యూసర్ 2012, నవంబర్ 14న ఓ పోస్ట్ చేసాడు. యాదృచ్చికంగా బ్రయంట్ అదే విధంగా తన ప్రాణాలను కోల్పోయాడు. 7 సంవత్సరాల క్రితం నోసో ఈ ట్వీట్ చేసాడు. సోమవారం తెల్లవారుజామున బ్రయంట్ మరణ వార్త తెలియడంతో నోసో ఈ పోస్టుపై క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రయంట్ అభిమానులు డాట్ నోసో జోస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నోసో చేసిన ఈ ట్వీట్ నిజమైన ట్వీటేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నోసో చెప్పినట్టే బ్రయంట్ మరణించడం విశేషం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/