రహదారి భద్రత అందరి బాధ్యత

Road safety

నేగం కన్నా ప్రాణం మిన్న. రహదారి భద్రతలో ప్రధాన సూత్రమిది. వినడా నికి, ప్రచారానికి బాగానే ఉంటుంది. కానీ పట్టించుకునేవారేరీ? ఉరుకుల పరుగుల యుగంలో ప్రయాణ కాలాన్ని తగ్గించేందుకు జాతీయ రహదారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నారు. అత్యంత వేగంగా గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకువెళ్లే వాహనా లను అందుబాటులోకి తెస్తున్నారు.ఇక భద్రతకు సంబం ధించి అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నాయి.

చట్టాల మీద చట్టాలు తెస్తున్నా రు.నిబంధనలను అతిక్రమించి వాహనాలను నడిపిన వారి పై గతంలో ఎన్నడూలేనివిధంగా వేలాదిరూపాయలు జరి మానాలు విధిస్తున్నారు.ఎన్నిచట్టాలు చేసినా, మరెన్నిశిక్షలు వేయించినా ఈ ప్రమాదాలు ఆగడం లేదు. ముఖ్యంగా మద్యం విషయంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరుతోనే ఈ ప్రమాదాలు అదుపుతప్పిపోతున్నాయనే విమర్శలను తోసిపుచ్చలేం.బుధవారం రాజస్థాన్‌లో జరిగిన బస్సుప్రమా దంలో 24మందికిపైగా మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బస్సు కోటా లాల్‌సౌట్‌ వద్ద అదుపు తప్పి బస్సునదిలో పడిపోయింది. ఇప్పటివరకు 24 మృతదేహాలను బయటకు తీశారు. ఇక గత శనివారం రాత్రి హైదరాబాద్‌నగరంలో నలుగురు యువకులు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడేమరణించారు. మరొకరు ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. గతవారంలో హైదరా బాద్‌ నగరంలో జరిగిన వివిధ రోడ్డుప్రమాదాల్లో పదిహేడు మందికిపైగా మరణించారు.

ట్రాక్టర్‌ నేరుగా పాఠశాలలోకి దూసుకుపోయిన ప్రమాదంలో పిల్లలకు మధ్యాహ్న భోజ నం తయారు చేస్తున్న వంటమనిషి చనిపోయింది. విజ యవాడలో ఒకే రోజు నాలుగు కార్లు సృష్టించిన బీభత్సం లో పలువ్ఞరు తీవ్రంగా గాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వారంలోనే వందలాది మంది అసువ్ఞలు బాసారు. మరెందరో క్షతగాత్రులయ్యారు. గుంటూరుజిల్లాలో ట్రాక్టర్‌ బోల్తాపడి నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

ఇక తమిళనాడులో జరిగిన మరొక ఘోరప్రమాదంలో ఇరవై మందికిపైగా మరణిం చారు.ఒక ప్రైవేట్‌ బస్సును ఒక ట్రక్క్‌ ఢీకొనడంతో సంఘ టనా స్థలంలోనే పదహారు మందికిపైగా మరణించగా మరికొందరు చికిత్స పొందుతూ అసువ్ఞలుబాసారు. మరో అరడజన్‌ మందికిపైగా మృత్యువ్ఞతో పోరాడుతున్నట్లు వైద్యవర్గాలే చెప్తున్నాయి. ప్రమాదాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఏటా రెండురాష్ట్రాల్లో కలిపి 15వేల మందికిపైగా మృతి చెందుతుండగా మరో 50వేల మందికిపైగా క్షతగాత్రులవ్ఞ తున్నారు. వీరిలో కొందరు శాశ్వతంగా అంగవికలురు అవ్ఞ తున్నారు.

కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ అభాగ్యులకు ఏమిచ్చినా, మాటలతో ఎంతఊరట కల్పించినా ఆ లోటు తీర్చలేం, పూడ్చలేం. కొన్ని సంఘటనలలో ప్రమాదాలకు గురై అసువ్ఞలు వీడినవారి శవాలను స్వగ్రామాలకు తీసుకు వెళ్లే ఆర్థికస్తోమత లేక బంధువ్ఞలు అక్కడికక్కడే ఖననం చేసిన సంఘటనలు ఎన్నోఉన్నాయి. తమ ఆప్తులను కడ సారికూడా చూసుకొని వారెందరో ఉన్నారు. బయటకు వెళ్లినవారు తిరిగి వచ్చేంతవరకు నమ్మకంలేని పరిస్థితులే దాపురించాయి.పెరుగుతున్న ఈ ప్రమాదాలు, బలైపోతున్న అమాయకుల విషయాలు పెద్దలకు తెలియందికాదు. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న ఈ ప్రమాదాల నివారణకు త్రికరణశుద్ధిగా ప్రయత్నాలు జరగడం లేదు.

సమీక్షలకు, సమావేశాలకు కొదవ లేదు. కసరత్తు కూడా పెద్దఎత్తునే చేస్తున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం కూడా సుదీర్ఘచర్చల అనంతరం నిబంధనలను అతిక్రమించే వాహన చోదకులకు భారీగా జరిమానాలు విధించే చట్టానికిరూపకల్పన చేసింది. బీమా లేకుండా వాహనం నడిపితే రెండువేలు, అంబులెన్స్‌ కు దారిఇవ్వకపోతే ఏకంగా రూ.పదివేలు జరిమానా విధించేవిధంగా నిబంధనలను రూపొందించారు.

గతంలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినవారికి రూ.వంద ఉన్న జరిమానాను ఇప్పుడు ఏకంగా రూ.వెయ్యికి పెంచారు. కానీ ఇవేమీ ఈ ప్రమాదాలను ఆపలేకపోతున్నాయి.మద్యం తాగి నడుపుతూ పట్టుబడుతున్నారు. జరిమానాలు చెల్లి స్తున్నారు. తిరిగి మళ్లీ మద్యం తాగుతూనే పట్టుబడుతున్నా రంటే అర్థం చేసుకోవచ్చు.జరిగిన,జరుగుతున్న ప్రమాదాల్లో అధికశాతం వాహనచోదకులు మద్యంమత్తులో ఉన్నవారేననే విషయం దర్యాప్తుల్లోనే బయటపడింది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారిప్రమాదాల్లో దాదాపు పదిహేనులక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. భారత్‌లోనే దాదాపు ఒకటిన్నర లక్షల మందికిపైగా చనిపోతున్నారు. ప్రపంచం లోని మోటార్‌ వాహనాల్లో రెండుశాతం మాత్రమేభారత్‌లో తిరుగుతున్నా రహదారుల ప్రమాదాల్లో 11శాతం ఇక్కడే జరుగుతున్నాయి. దేశంలో మోటార్‌ వాహనాలు రైళ్లు ఢీ కొన్న సంఘటనలు నాలుగు లక్షల తొంభైఆరువేలకుపైగా జరిగినట్లు జాతీయ నేరగణాంకాల సంస్థ నాలుగేళ్ల క్రితమే తెలిపింది. వీటిలో రహదారుల మీద వాహనాలు ఢీకొన్న సంఘటనలు నాలుగు లక్షల అరవైనాలుగువేలకుపైగా ఉ న్నాయి.

ఈ ప్రమాదాలకు అతివేగం,మద్యంసేవించి నడపడ మేనని ఆ నివేదిక వెల్లడించింది.బ్రిటన్‌,ఆస్ట్రేలియా, స్వీడన్‌, తదితర దేశాల్లో ఆ ప్రభుత్వాలు సమర్థవంతమైన చట్టాలు తీసుకురావడం వల్ల రహదారి భద్రత మెరుగుపడింది. భారత్‌లో కూడా చట్టాలవైపు అడుగులు వేస్తున్నారు.

2014 జూన్‌లో అప్పటి కేంద్రమంత్రి గోపీనాథ్‌ ముండే రహదారి ప్రమాదంలో మరణించినప్పటి నుంచి ఈ కసరత్తును చేస్తూ నే ఉన్నారు.2020 కల్లా రహదారి ప్రమాదాలను సగానికి తగ్గిస్తామని బ్రెసేలియాతో భారత్‌ ఒప్పందం కూడా చేసుకు న్నది. ఇప్పటికైనా పాలకులు రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

ఆదాయమే లక్ష్యంగా వ్యవహరించడం మాని మానవతాదృష్టితో ప్రమాదాల నివారణకు నడుం కట్టాలి. వరుస ప్రమాదాలకు కారకులైన చోదకుల లైసెన్సులను రద్దు చేయడమేకాక వారు జీవితం లో స్టీరింగ్‌ పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే చట్టానికి మరింత పదునుపెట్టాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/